నిను తడిమే నా చూపులని
నీ చూపు ఆపేస్తోంది
బిగిలో నీ పరిమళాన్ని
నా బిడియం ఆపుతోంది
నిను తాకే ఆరాటాన్ని
మొహమాటమాపుతున్నది
నీపై ప్రేమను తెలుప
మన స్నేహమాపుతున్నది
నువు చదవలేని ఈ కవితను
కళ్ళతొ రాసాను శ్వాసతోటంపాను
నిను చేరలేని ఈ దూరాన్ని
వెతతో నింపాను వేదనయి నిలిచాను
1 comment:
హ్యాపీ హ్యాపీ...మళ్ళీ అక్షరాలని నర్తించేలా చేసారు.
Post a Comment