దాని ఎడమ భుజముపై కడువ
ఆ బరువుతో వంగెను నడువ
ఆ వంకతో లాగెను నా మనువ
ఇక నీకే అంకితమీ జనుమ
నా పంటిన నలిగెను ఓ వేప
నిను చూడగ మారెను అది తియ్య
నా గుండెను కోసెను నీ చూపు
అది కొంటెగ చూపెను నీ వీపు
నిను మించిన పొగరు నీ కురులే
వాటిని ఆపక ఆపెను సిగ ముడులే
వాటిని మోయక మోసెను మెడలే
ఆ మెడలో వెయ్యన ఓ తాళే
3 comments:
అందమైన మీ అక్షరాలతో మీ బ్లాగ్ ను మరల అలంకరించి పూర్వ వైభవాన్ని తీసుకురండి.
Thank you Padmarpita garu.. mee prodbhalamtO malli praytnistunnanu
ధన్యవాదాలు...మళ్ళీ బ్లాగ్లో వెలుగులు విరబూయాలని కోరుకుందాము.
Post a Comment