Followers

Wednesday, December 30, 2020

ఆత్మ

 జననం ఘటనం

జీవం మిధ్యం

మరణం సత్యం

ఆత్మం  చిరం

ఇదం తధ్యం

సన్నార్థం దైవం

Tuesday, December 29, 2020

స్త్రీ

సృష్టి కార్య మూలానివై
సృష్టి వీర్య దారివై
సృష్టికి మూలం నీవు

తపొః భంగ తంత్రానివై
యుద్ధ మూల మంత్రానివై
సృష్టికి అంతం నీవు

అందం నీవే, బంధం నీవే
సర్వం నీవే, శూన్యం నీవే
సంసారం నీవే, సన్యాసం నీవే

Sunday, October 11, 2020

బతుకు బండి

పోటెత్తిన ఓటమితో
కొండెక్కిన జీవితాన్ని
సాగనంపిన సాగిపోని
బతుకు బండిపైన
ఎన్నాల్లిల? ఎన్నేల్లిల?
గమ్యమెరుగని పయనం

Tuesday, October 6, 2020

భార్య

తడి ఆరని ముంగుర్లని 

వడిగా ముడిలో నెట్టి

తడిసి తడవని నడుమును

తుడిచి తుడవక వంచి

వాలిపొతున్నా వంకను

కొంగున బిడి బిగించి 

పారే ఝరినోలే

జారే చీరను సర్ది

అరుణ సింధూరంతో

అరుణోదయాన

వడి వడి అడుగులతో 

వేడిని కక్కే కాఫినిచ్చే

ఔదార్యమే కద భార్యంటే

Friday, September 4, 2020

అందుకోలేకున్నాను

తొలకరి పులసల్లే యధ ఎగిరిపడుతోంది

మలిదారి మలుపల్లే మన కధ మారుతోంది

అద్దంలో బొమ్మల్లే నువు అందకున్నావు

కళ్ళలో చూపల్లే నిను తాకలేకున్నాను

చదవలేని కవిత

నిను తడిమే నా చూపులని

నీ చూపు ఆపేస్తోంది

బిగిలో నీ పరిమళాన్ని 

నా బిడియం ఆపుతోంది

నిను తాకే ఆరాటాన్ని 

మొహమాటమాపుతున్నది

నీపై ప్రేమను తెలుప

మన స్నేహమాపుతున్నది

నువు చదవలేని ఈ కవితను

కళ్ళతొ రాసాను శ్వాసతోటంపాను

నిను చేరలేని ఈ దూరాన్ని

వెతతో నింపాను వేదనయి నిలిచాను

Tuesday, July 28, 2020

ఇక నీకే అంకితమీ జనుమ

దాని ఎడమ భుజముపై కడువ
ఆ బరువుతో వంగెను నడువ
ఆ వంకతో లాగెను నా మనువ
ఇక నీకే అంకితమీ జనుమ

నా పంటిన నలిగెను ఓ వేప
నిను చూడగ మారెను అది తియ్య
నా గుండెను కోసెను నీ చూపు
అది కొంటెగ చూపెను నీ వీపు

నిను మించిన పొగరు నీ కురులే
వాటిని ఆపక ఆపెను సిగ ముడులే
వాటిని మోయక మోసెను మెడలే
ఆ మెడలో వెయ్యన ఓ తాళే

Thursday, March 26, 2020

మిగిలిందేముంది నాదంటూ

నీ యధలోని శ్వాశ నేనేననుకున్నా
ఆ శ్వాశలోని ఆశ నేనేననుకున్నా
ఆ ఆశలోని బాష నేనేననుకున్నా
నీలొ ప్రతి అనువు నేనేననుకున్నా

నీవంతా నేనేననుకున్నా
నేనంతా నువ్వేననుకున్నా
నే లేని నువులేవననుకున్నా
నీవు లేని నేనులేననుకున్నా

నీకంటు మరు లోకముందంటూ
ఆ లోకంలో నేలేనంటూ
నీవైపోయింది నా లోకమంటూ
అందు మిగిలిందేముంది నాదంటూ 

Saturday, March 14, 2020

జీవితంలో జీవం లేదు

కంటిలో కాంతి లేదు
బాషలో భావం లేదు
నడకలో గమ్యం లేదు
శ్వాశలో ఆశ లేదు
జీవితంలో జీవం లేదు
గడిచిన సమయం
విడిచిన జ్ణాపకం
తప్ప మిగిలిందేమి లేదు