Followers

Tuesday, May 9, 2017

శూన్యం

ఈ విశాల శూన్యం నీకు
భూమినిచ్చింది,
భూమిలో చెట్టునిచ్చింది,
చెట్టుపై కాయనిచ్చింది,
భూమిలో గనులూ, గనులలో మణులూ,
గనులు మణులతో సిరుల నిచ్చింది,
గాలినిచ్చింది, నీరునిచ్చింది, నిప్పునిచ్చింది,
వీటన్నిటితో నీకు బతుకునిచ్చింది
యిన్నిటినిచ్చిన  శూన్యాన్ని
ఇంకా యేమి అడగ గలవు!
నీతిగా బ్రతకటం తప్ప!!