వాగిష విపంచి తలపు ఈతను వాగిష్వరి స్వర వరము,
సంగీత స్వర గమనం తానో సరిగమల ఝరీగమనం.
చేతిని తాకిన ప్రతి తీగ చేతన పొంది రాగం పలుకుగా,
గలమున పలికిన ప్రతి మాట ఓ స్వరమై పాటగా మారదా?
స్వర లాస్యం తన పలుకు, లావన్యం ఈతని లలనం
ఎప్పుడో నే చేసిన పున్యం తన ఇంటి పేరు సంక్రమించటం.