Followers

Friday, June 21, 2019

నా ప్రాణం

పాటలో ఇమిడిన రాగంలా
మాటలో ఇమిడిన భవంలా
నీలో ఒదిగిపోయింది నా ప్రాణం
వీడిపోతుంటే తెలుస్తుంది దాని భారం

Friday, January 25, 2019

శివం శివం, అశివం శివం

రౌద్రం శివం, శాంతం శివం
ఆద్యం శివం, అంతం శివం
మాధ్యం శివం, విశయం శివం
మితం శివం, అమితం శివం
జయం శివం, అజయం శివం
జననం శివం, మరణం శివం
సత్యం శివం, నిత్యం శివం
సుక్రుతం శివం, విక్రుతం శివం
భయం శివం, అభయం శివం
సర్వం శివం, శూన్యం శివం
భ్ర్హమం శివం, హరిం శివం
పరం శివం, హరం శివం
ఇహం శివం, అహం శివం
శివం శివం, అశివం శివం

Saturday, October 20, 2018

ఇష్టం

నిను ప్రేమిస్తే అది నా ఇష్టం
నను ద్వేషిస్తే అది నీ ఇష్టం
కదనగలవేమో నా ఇష్టాన్ని
కాని లేదనలేవు నా ఇష్టాన్ని

Saturday, October 13, 2018

ఓరుగల్లు

ఒదిగుండి జూస్తివ ఓరుగల్లు ఇది
పోరాడ జూస్తివ పోరుగల్లు ఇది
రత్నంతో మీటితివ రత్నాలవీణ ఇది
రౌద్రంతో మీటితివ రుద్రవీణ ఇది
సైన్యానికి విప్లవం నేర్పిన శైవం ఇది
జీవితానికి మర్మం నేర్పిన వైశ్నవం ఇది
ధర్మానికి శంతిని కలిపిన బౌద్ధం ఇది
నాట్యనికి లాస్యం కలపిన లావణ్యం ఇది
ఒదిగుండి జూస్తివ ఓరుగల్లు ఇది
పోరాడ జూస్తివ పోరుగల్లు ఇది

కర్మ సిద్ధం

కర్మానుసారేన వర్ణం
వర్ణానుసారేన ధర్మం
ధర్మానుసారేన జీవనం
ఇహలో సర్వం కర్మ సిద్ధం
భువిలో నాస్తి జన్మ సిద్ధం

Friday, August 10, 2018

మధూవాచకం

సుదూరాన్న శునకమైన సుందరంగుండు
ముందరున్న మణిలొనైన మరకగుపించు
దూరమెరిగి దరికి చెరిన వాడు ధన్యుడు
మధురమవుకున్న మర్మమెరిగినవి మధూవాచకం

Sunday, April 15, 2018

ఆడవారు

పాచికలెందుకు వారి పరాచికాలుండగా
చురకత్తులెందుకు వారి చమక్కులుండగా
స్వర్గమెందుకు వారి సాంగిత్యముండగా
నరకమెందుకు వారి నిరసనుండగా
పురషప్రపంచానికి వారు పరుశార్దము కారా