ఒదిగుండి జూస్తివ ఓరుగల్లు ఇది
పోరాడ జూస్తివ పోరుగల్లు ఇది
రత్నంతో మీటితివ రత్నాలవీణ ఇది
రౌద్రంతో మీటితివ రుద్రవీణ ఇది
సైన్యానికి విప్లవం నేర్పిన శైవం ఇది
జీవితానికి మర్మం నేర్పిన వైశ్నవం ఇది
ధర్మానికి శంతిని కలిపిన బౌద్ధం ఇది
నాట్యనికి లాస్యం కలపిన లావణ్యం ఇది
ఒదిగుండి జూస్తివ ఓరుగల్లు ఇది
పోరాడ జూస్తివ పోరుగల్లు ఇది
పాచికలెందుకు వారి పరాచికాలుండగా
చురకత్తులెందుకు వారి చమక్కులుండగా
స్వర్గమెందుకు వారి సాంగిత్యముండగా
నరకమెందుకు వారి నిరసనుండగా
పురషప్రపంచానికి వారు పరుశార్దము కారా