Followers

Wednesday, December 2, 2015

కంచి దాటిన మధుర కధనం

రావణ వధ వరకు, రామం రమణీయం.
అయోద్యపతి అయిన రఘుపతి,
అదోగతినొందిన సీతాపతి.
జననం, గమ్యం పిదప మోక్షం.
అటు పిమ్మట కల్పమయిన
అది కంచి దాటిన మధుర కధనం.
రామావతారం కధాకధనం నేర్పినదిది.  

Monday, November 9, 2015

నీరు

నీరమై మేఘమై
తొలకరి చినుకునై
కట్ట వెనుక నీటినై
అది తెంచిన వరదనై
నేలలో కలిసిన బురదనై
దాహమై, దేహమై
వేదమై, సేధ్యమై
నీ జీవితాన ప్రతి అడుగు నేనే
నా మరణానికి ప్రతి రుజువు నీవే

Sunday, October 25, 2015

కట్టుబాటు

కట్ట వెనక ఉంచిన నీటిని, మట్టం చూసి
మల్లించకపోతే ఉప్పెనై మట్టు పెడుతుంది.
కట్టు కోసం పెంచిన కట్టుబాటును,
సమయం చూసి సవరించక పోతె
కట్టిన వారిని మట్టి కలుపుతుంది

Saturday, October 24, 2015

ప్రధమ నరుడు

జననం మరణం పుఃనరతి జననం,
మనుషులకిది మాయామర్మం,
నరాధముల జన్మల కధనం.
తొమ్మిది జన్మలు పైపడ్డా, దశావతారానికై
వేచి ఉన్న నర నారాయణుడు
ప్రధమ నరుడు కాడా? 

Friday, October 23, 2015

నే హిందువుని, పాటించునది హైందత్వము

జన్మించి మనుజుడనై,
పోషించి యాదవుడనై,
పూజించి బ్రాహ్మనుడనై,
ఆర్జించి వైశ్యుడనై,
రక్షించి క్షత్రియుడనై,
సర్వ కార్యాన్నా
సకల కులములనొంది,
జీవకోటి మద్య చరాచరముల నడుమ,
తనువు మనువు విడదీసి బ్రహ్మత్వమొందుదను
నే హిందువుని, పాటించునది హైందత్వము

Sunday, October 11, 2015

కంచిని దాటిన మధుర కధనం

క్షణం క్షణమయితే అనుక్షణం
ఆ క్షణమే పుష్కరమయితే అక్షణం.
రావణం వరకు, రామం రమణీయం,
అయోద్యాపతి అయిన రఘుపతి,
అదోగతినొందిన సీతాపతి.
జీవిత గమ్యం జీవన రమ్యం,
ఆ పిదప మోక్షం వాటి నడుమ కల్పం
కంచిని దాటిన మధుర కధనం.

Sunday, October 4, 2015

మనోనేత్రం

కనులు చూసేది ప్రపంచం చూడలేనిది జ్ణానం
కనులు చూసేది ప్రక్రితి చూడలేనిది అందం
కనులు చూసేది మనిషిని చూడలేనిది మానవత్వం
భ్రహ్మ కనులు సైతం చూడగలిగేది తన శ్రిశ్టిని 
చూడలేవు తనని శ్రిశ్టించిన పద్మనాభాన్ని
రెండు కనులు ఉన్నా చూడలేని సత్యాన్ని 
చూపగలిగేది ఒక్క మనోనేత్రంబు మాత్రమే