Followers

Saturday, August 27, 2011

లంచం

లంచం తీసుకునే తప్పు చేసే ప్రతీ వాడికి అన్నా ఉన్నాడు.
మరి తప్పు కప్పేందుకు లంచమిచ్చే తమ్ముల్లకి ఎవరు అన్నా?

Monday, August 15, 2011

స్వాతంత్ర దిన శుభకాంక్షలు

అహింసతో అనంత హింసా స్వేచ్ఛను సాదించాం
ఏకత్వంతో మనం మనలేని భిన్నత్వన్ని సాదించాం.
షష్ఠి పూర్తయ్యి భారతావనికి అయిదేల్లు గడిచినా,
శృష్టి అవతరించి మానవాలికి యుగాలు తీరినా,
నాగరికత ఆధునిక నగరాలు చేరినా,
అనాగరిక అటవుల్లొనే ఊరేగుతున్నాం,
జీవనానికై జంతువులై పోరాడుతునే ఉన్నం.
భరించలేని భారాలతో, కాయలేని గాయాలతో
ఓర్వలేని క్రోదంతో, స్వేచ్ఛా పయణం సాగించే
ప్రతి భారతీయుడికి నా స్వాతంత్ర దిన శుభకాంక్షలు

Thursday, August 11, 2011

నే చూడని నా చంటి తనాన్ని నాకు చుపించావు

మగతలో నువ్వు మరు లోకంలో విహరిస్తూ
ఈ లొకంలో చిరునవ్వుతో మమ్ము మురిపిస్తూ
మెరిసే కళ్ళతో, వాటిని కప్పే ఉల్లి పొర రెప్పలతో
మాయ చేసే అమాయకత్వంతో, అర్ధంలేని అరుపులతో
బుడి బుడి నడకలతో, వడి వడి చేశ్టలతో,
కొంత వింత కొంత చింత, కొంటె నవ్వుతో, కంట కన్నీటితో
నే చూడని నా చంటి తనాన్ని నాకు చుపించావు