Followers

Friday, March 31, 2023

మనిషి

 గాలినైతే గంధమెరుగక కలుపుకెల్తిని

నీటినైతే కట్టనెరిగి మలుపుకెల్తిని

పశువునైతే లోకమెరుగక రమించిపోతిని

మనిషినైతిని తర్కమెరిగి తపించిపోతిని

Wednesday, March 1, 2023

నాకెందుకు

 పెట్టుబడి పెత్తందారులను చేసిందంట

శోషలిజం సోమరిపోతులను చేసిందంట

కమ్యునిజం నియంతలును చేసిందంట

ప్రజాస్వామ్యం ఓట్ల పేకలు చేసిందంట

ఏది ఒప్పు ఏది తప్పు నాకెందుకు చెప్పు

నా వాళ్ళు నా ఇల్లు తప్ప నువ్వెందుకు వెళ్ళు

Saturday, February 4, 2023

భారతం

 

గఱికనరయు గిడ్డంగులెన్నున్నా

కమల్చ కించిత్ కిత్తుండగా చాలదా

వీరులెందరున్నా రారాజునోటుపఱుచ

దుర్నీతొక్కటి చాలునన్నది భారతం


Monday, January 30, 2023

వాలు జడ

 

వాలు జడ వంక వాలు కంట చూడ

వల్లిల వళి వలనై నను వాల్చెనది

పలు వలువల మత్పడచుకు

పులు హేతువు కదా ఈ వాలు జడ