ఐవరు ఇంద్రుల ఇంతి కథ
అగ్నిజాతమయోనిజ కథ
పలుపతుల కులసతి కథ
వేదజవెత ప్రత్యుక్తం భారతం
ఇందు లేనిది ఇంకెదునూ లేదంట
ఇందు కలదది వేద సారంబట
ఇందు శ్రీసాపత్యం ఎందునూ లేదంట
సత్యసుతోవచ సుసంహితం భారతం
సుబద్దము సుగనమని ఇంతులందురు
సుబద్దము సాదరించు ఇంతులెందరు
అబద్దమే సాకరించు ఇంటనందరికి
మధురమవ్వకున్న నిక్కమిది మధూవాచ
వివరించినది కృష్ణుడినట
విరచించినది వ్యాసుడట
వినిపించినది శుకుడట
వినితరించినది పరిక్షిత్తుడట
తెలుగించినది పోతనట
మోక్షమొందినది ప్రతి తెలుగువాడట
కృష్ణ విరచిత కృష్ణత్రయ కథ
కృష్ణుడికై ఉప్పతిల్లిన కృష్ణ కథ
కృష్ణుడిచే బోధించపడ్డ కృష్ణ కథ
చతుర్కృష్ణేచ అకృష్ణం భారతం