ఐవరు ఇంద్రుల ఇంతి కథ
అగ్నిజాతమయోనిజ కథ
పలుపతుల కులసతి కథ
వేదజవెత ప్రత్యుక్తం భారతం
కృష్ణ విరచిత కృష్ణత్రయ కథ
కృష్ణుడికై ఉప్పతిల్లిన కృష్ణ కథ
కృష్ణుడిచే బోధించపడ్డ కృష్ణ కథ
చతుర్కృష్ణేచ అకృష్ణం భారతం
నీతో నా స్పర్శ ఓ యోగము నది
నీటిలోనా, రాతిలోన
చెట్టులోనా, పుట్టలోన
గాలిలోనా, ధూళిలోన
అంతా నీవా?
నీలోనే అంతా?
నాలో నీవా?
నీలోనే నేనా?
ప్రశ్నవి నీవా?
జాబువి నీవా?
నిన్నెతుక తిలి
అడుగు నేనా?
రాజు చెప్పేది రాజకీయము
కవులు చెప్పేది నాటకీయము
నెగ్గి చెప్పిందంతా నీతివాక్యము
నిలకడ లేనిది నిక్క వాక్యము
ధూలి చేత, గాలి చేత
నీటి చేత, నిప్పు చేత
ఎన్నిసార్లు మరణించదనయ్యా
నాస్తి నా
ఆస్తనినెరుంగక.
అందమని, బంధమని
యోగమని, భోగమని
ఎన్నిసార్లు జీవించదనయ్యా
నీ శబ్ధమందు
నిశబ్ధమెరుంగక
నా తల్లి పేరు మార్చినా
తన ముక్కలకతుకులేసినా
తన ఆచారాన్ని అనచివేసినా
ఆచరించువారు అంతరించిపోతున్న
ఉర్వికెల్లా శాంతి చూపనా
సామరస్యమను సాము చేయనా
రాజ్యమని మతమని వర్తకమని
పూటకొక్క పేరుతో, పుటానికొక్క రీతితో
తన అస్తిత్వాన్నే అస్థిర పరిచినా
అసలు రూపాన్నే మార్చి వేసినా
ఉర్వికెల్లా శాంతి చూపనా
సామరస్యమను సాము చేయనా
నయనానందమునొంద అరూపస్యరూపిణివే
సుగంధపరిమళమొంద విభూతిలేపినివే
శ్రవణానందమునొంద డమరుకధారివే
మదిపులకింతనొంద తాండవకేళివే
ఏమొంద నే నీ నుండి యోగధ్యానముతప్ప