Followers

Sunday, December 12, 2021

దేవుడు

 తనని విశంతో నింపిన

దేవునికేమో పూల దండం

తన కర్త్వ్యం నిరవేర్చు

పాముకేమో బడిత దండం

పైగ శ్రిష్టించిన తానే

చంపి దేవుడయ్యేనంట

Wednesday, December 8, 2021

నర హర హరి

నడిచేది నరుడంట

నడిపించేది హరుడంట

గమనం హరిదంట

సమస్తం నర హర హరి సమ్మేళనమంట

Sunday, September 5, 2021

మోక్షం

 పనిని మించి పని ఉంచకేపూట

పాలు పితుకు సమయమన్నా 

నిలిచి ఉండకేచోట

కరిగిపోకు అందమని బంధమని

కలిసిపోకు కులమని మతమని

ఓదిగిపోకు హక్కులని భాద్యతని

ఒక్కోటి ఒక కోటి బంధాలై

నిలువరింపునిన్ను ఈ లోకాన

Saturday, February 13, 2021

ఱేడు

ప్రకాశం సూరీనిది

ప్రతాపం సూరీనిది

దివిసీమ అతనిది

చుక్కలసేన అతనిది

చౌద్యమెరుగుదువ

ఱేడు మాత్రం చంద్రుడట