Followers

Monday, October 28, 2019

ప్రేమే కద మన బలం, ప్రేమే కద బలహీనం

ఇరువురితో కూడిన దైవం సాక్షిగా
దైవంతో కూడిన ధైర్యం సాక్షిగా
ధైర్యంతో కూడిన ప్రేమ సాక్షిగా
ప్రేమే కద మన బలం
ప్రేమే కద బలహీనం

నరకమయ్యింది మాత్రం జీవితం

మండుతున్నది సూర్యగోళమైన
మసివారేది మాత్రం భూగోళము
మరిచిపోయింది నువ్వయిన
మరుగయిపొయింది నా హ్రుదయం
తగిలిన దెబ్బ మనసుకయిన
నరకమయ్యింది మాత్రం జీవితం

Monday, October 21, 2019

ఓంటరయిన ఈ జీవితాన్ని ఓడిపోవాలనుంది

తెలివి కూడిన లోకంలో తెలివితో ఉండాలని లేదు
విలువ కూడిన లోకంలో విలువతో ఉండాలని లేదు
తెలిసిన ఈ లోకంలో తెలియకుండా తేలిపోవలనుంది
మరువలేని నీ జ్ణాపకాలను మరిచిపోవాలనుంది
నీతోలేని ఈ లోకాన్ని వీడిచి పోవాలనినుంది
ఓంటరయిన ఈ జీవితాన్ని ఓడిపోవాలనుంది