Followers

Monday, July 8, 2019

నీ నా హ్రుదయం రోదిస్తున్నది చూడు

కంటి కట్ట తెంచుకున్న కన్నీటి సాక్షిగా
పెదవంచున తడిసిన నీ పేరు సాక్షిగా
నీ జ్ఙాపకాలతో బరువెక్కిన గుండె సాక్షిగా
నా ఈ హ్రుదయం ఏడుస్తున్నది చూడు
నీ నా హ్రుదయం రోదిస్తున్నది చూడు 

Thursday, July 4, 2019

నేనుగా మారిన నిన్నేమిచెయ్యను

అలవాటువయితే మార్చుకుంటాను
జ్ఙాపకానివయితే మరిచిపోతాను
గాయానివయితే మానుపుకుంటాను
ప్రాణానివయితే విడిచిపోతాను
నేనుగా మారిన నిన్నేమిచెయ్యను

Wednesday, July 3, 2019

హత్యలలో ఘాతుకం మనోహత్య

మనస్సులోని ఆశ ఒక భాష
అందులోని భావం ఒక బాస
బాస నిలపలేని జీవితం అబాస
అబాసమయిన జీవితం అమావాస

పాతకాలలో ధారుణం హత్య
హత్యలలో ఘాతుకం మనోహత్య