Followers

Saturday, October 20, 2018

ఇష్టం

నిను ప్రేమిస్తే అది నా ఇష్టం
నను ద్వేషిస్తే అది నీ ఇష్టం
కదనగలవేమో నా ఇష్టాన్ని
కాని లేదనలేవు నా ఇష్టాన్ని

Saturday, October 13, 2018

ఓరుగల్లు

ఒదిగుండి జూస్తివ ఓరుగల్లు ఇది
పోరాడ జూస్తివ పోరుగల్లు ఇది
రత్నంతో మీటితివ రత్నాలవీణ ఇది
రౌద్రంతో మీటితివ రుద్రవీణ ఇది
సైన్యానికి విప్లవం నేర్పిన శైవం ఇది
జీవితానికి మర్మం నేర్పిన వైశ్నవం ఇది
ధర్మానికి శంతిని కలిపిన బౌద్ధం ఇది
నాట్యనికి లాస్యం కలపిన లావణ్యం ఇది
ఒదిగుండి జూస్తివ ఓరుగల్లు ఇది
పోరాడ జూస్తివ పోరుగల్లు ఇది

కర్మ సిద్ధం

కర్మానుసారేన వర్ణం
వర్ణానుసారేన ధర్మం
ధర్మానుసారేన జీవనం
ఇహలో సర్వం కర్మ సిద్ధం
భువిలో నాస్తి జన్మ సిద్ధం