నీ కధను నేను
కధకు కదనం నేను
నీ ఎత్తును నేను
ఎత్తుకు పైఎత్తును నేను
నీ కన్నీటిని నేను
కన్నీటిన తడిసిన రక్తం నేను
నీ కధకు నాయకుడు నేను
వాడికి ప్రతినాయకుడు నేను
నువు కట్టిన కోటను నేను
అందున మిగిలిన శకలం నేను
నీ కాలం నేను
కాలానికి గమనం నేను
నీ చరిత్రను నేను
నువ్వు స్రుష్టించిన విచిత్రం నేను
నాచుపై తనువుని చాచి పరువళ్ళు
తొక్కిన నీటిదెంత అద్రుష్టమో కదా
దంత దీప్తులు ఘన కీర్తులుగా కల
నీ కంటీ కిరణాములు తన చరణములంటినవని
అఱ్ఱులు చాచిన నీటిదెంత అద్రుష్టమో కదా
కొన్ని పదాలతో మిన్నార్ధామే కవితయితే
పసివాణ్ణి మించిన భావుకుడెవరు
శ్రోత మనోరంజనమే గానమయితే
తల్లిని మించిన గాయకులెవరు
లక్ష్యం సాధించిన సరళమయిన మిన్న
అది సాధించని ఘన సాదనాలేలా?