Followers

Thursday, October 6, 2016

దైవం

దేవునిలొ దైవం వెతుకు
పూజలొ పుణ్యం వెతుకు
ఆచరణలో ఔనతయ్యం వెతుకు
కానరాని స్వర్గమునకై
కనుచూపు మేర నరకం సృష్టించకు

Wednesday, August 31, 2016

మతము - శాస్త్రము


శాస్త్రంలో మతం వెతుకకు
మతంతో శాస్త్రం నిరూపించకు
రహస్యాన్ని చేదించ శాస్త్రము
మనిషిని నడిపించ మతము
మతములోని శాస్త్రం మూఢము

Monday, July 25, 2016

అంతా మనుజులే, పర ప్రాంత పలాయినులే

ర్యలుగా వెళ్ళి అర్యులుగా తిరిగి వచ్చినా
బానిసలు యూథులుగా మారినా
యూథుని బిడ్డ క్రీస్తు అయినా
క్రీస్తూని  నమ్మిన క్రైస్తవులయినా
బుద్ధునిగా మారిన గౌతముడయినా
ఆతనిని నమ్మిన బౌధికూలయినా
ప్రవక్తయినా మహమ్మదు అయినా
ఆతనిని నమ్మిన మహమ్మదీయులయినా
అంతా మనుష్యులే, అందరూ
పర ప్రాంత పలాయినులే