Followers

Saturday, January 28, 2012

నీలో కలిసిపోయిన ఈ నేను...నీ నేను

ఒత్తయిన తన కురులను తీర్చి
తీర్చిన కురులలో చంద్ర వంకను పేర్చి
ఆ వంకను పోల్చే నడువంపును చూపి
ఆ వంపుల నడుమ వయ్యారము వార్చి
ఆ వయ్యారంతో నా యద దోచి
దోచిన యదను తన మదిలో దాచి
ఆ మదిలో ఆశను నా బతుకుగ మలిచి
ఆ బతుకున తోడుగ నిలిచిన ప్రాణమా ..
నీ ఎడబాటే ఎరుగనంటూ
నీ ఆరాధనే మరువనంటూ
అసలు నేనే లేనంటూ,
నీలో కలిసిపోయిన ఈ నేను...నీ నేను

Thursday, January 26, 2012

లోకమెరుగని అమాయకమంట మా మయూఖమంత

లోకమెరుగని అమాయకమంట మా మయూఖమంత
అంతెరుగని ఆగమంట దాని అల్లరంత
పొద్దు పూచినంత పొద్దు గడవనివ్వదంట
అమ్మ అమ్మ అంటు అమ్మ కొంగు వెంట
చేతికందినంత చేతి వాటమంట
దైవ మందిరమయిన దాని ఆధీనమంట
పాల బువ్వ వేళ భావ కవితలంట
లాల పోసు వేల లాలి పాటలంట
లోకమెరుగని అమాయకమంట మా మయూఖమంత
అంతెరుగని ఆగమంట దాని అల్లరంత