పడి లేచే కెరటమే జీవితమని
మరల తరలి ఎగిసి పడాలాని
అలుపెరుగని ఈ జీవితాన్ని
తలపన్నదెరుగక ముగించకు.
కాలం కమనీయం, రాగం రమణీయం
లాస్యం, హాస్యం ఎరుగని జీవితం సూన్యం
అలుపెరుగని ఈ జీవితాన్ని
తలపన్నదెరుగక ముగించకు
పీల్చే ప్రతి శ్వాసలో జీవించూ
తలిచే ప్రతి భావన పలికించూ
చూసే ప్రతి చూపుతో పులకించు
అలుపెరుగని ఈ జీవితాన్ని
తలపెరుగని జీవితంగా ముగించకు.