కళ్ళ ముందు నువులేకున్నా,
పలుకుతున్నది నువుకాకున్నా,
కనిపిస్తున్నది నీ రూపే
వినిపిస్తున్నదీ నీ పలుకే.
సాయంసమయం అంత త్వరగా సాగిపోవాలా?
మరో గంటయిన గడవకుండానే వెడలిపోవాలా?
ఇప్పుడిక్కడుండలేక అక్కడికి రాలేక
తపించే మనస్సుని తర్కించేది ఎలా?
చూస్తూంటే వెన్నల కూడా కాల్చేస్తూంది,
వేచ్చేస్తూంటే క్షణమయినా కదలనంటోంది.
ఇప్పుడీ వింత రాత్రి గడిచేదెలా?
గడిచినంత మాత్రాన్న నిన్ను కలిసేదెలా?
ఏ సాకుతో నిన్ను కలవను?
ఏ ఊసుతో నిన్ను పలకరించను?
రోజూ కలిసే నిన్ను కలవాలంటే ఇంత కష్టమా?
రోజూ మాటాడే నీతో మాట్లాడాలంటే ఇంత నిష్టూరమా?
ఇంత వింతా నిన్ను కలిసిన ఒక్క గంట వల్లేనా?