Followers

Tuesday, July 28, 2020

ఇక నీకే అంకితమీ జనుమ

దాని ఎడమ భుజముపై కడువ
ఆ బరువుతో వంగెను నడువ
ఆ వంకతో లాగెను నా మనువ
ఇక నీకే అంకితమీ జనుమ

నా పంటిన నలిగెను ఓ వేప
నిను చూడగ మారెను అది తియ్య
నా గుండెను కోసెను నీ చూపు
అది కొంటెగ చూపెను నీ వీపు

నిను మించిన పొగరు నీ కురులే
వాటిని ఆపక ఆపెను సిగ ముడులే
వాటిని మోయక మోసెను మెడలే
ఆ మెడలో వెయ్యన ఓ తాళే

Thursday, March 26, 2020

మిగిలిందేముంది నాదంటూ

నీ యధలోని శ్వాశ నేనేననుకున్నా
ఆ శ్వాశలోని ఆశ నేనేననుకున్నా
ఆ ఆశలోని బాష నేనేననుకున్నా
నీలొ ప్రతి అనువు నేనేననుకున్నా

నీవంతా నేనేననుకున్నా
నేనంతా నువ్వేననుకున్నా
నే లేని నువులేవననుకున్నా
నీవు లేని నేనులేననుకున్నా

నీకంటు మరు లోకముందంటూ
ఆ లోకంలో నేలేనంటూ
నీవైపోయింది నా లోకమంటూ
అందు మిగిలిందేముంది నాదంటూ 

Saturday, March 14, 2020

జీవితంలో జీవం లేదు

కంటిలో కాంతి లేదు
బాషలో భావం లేదు
నడకలో గమ్యం లేదు
శ్వాశలో ఆశ లేదు
జీవితంలో జీవం లేదు
గడిచిన సమయం
విడిచిన జ్ణాపకం
తప్ప మిగిలిందేమి లేదు

Monday, November 25, 2019

పిచ్చివాన్ని చేసావు

మధిలోకి రానన్నావు
మతిని వీడి పోనన్నావు
లోకాన్ని మరిపించావు
ఆ లోకంలోనే వదిలేసావు
మరిచి పోనన్నావు
మరుపుకే నిర్వచనమైనావు
మత్తు వలదన్నావు
గాయనికి మందులేక చేసావు
కలలోనైనా వీడిపోవు
కలలు రాకుండా ఆపలేను
పిచ్చివాన్ని చేసావు

Monday, October 28, 2019

ప్రేమే కద మన బలం, ప్రేమే కద బలహీనం

ఇరువురితో కూడిన దైవం సాక్షిగా
దైవంతో కూడిన ధైర్యం సాక్షిగా
ధైర్యంతో కూడిన ప్రేమ సాక్షిగా
ప్రేమే కద మన బలం
ప్రేమే కద బలహీనం

నరకమయ్యింది మాత్రం జీవితం

మండుతున్నది సూర్యగోళమైన
మసివారేది మాత్రం భూగోళము
మరిచిపోయింది నువ్వయిన
మరుగయిపొయింది నా హ్రుదయం
తగిలిన దెబ్బ మనసుకయిన
నరకమయ్యింది మాత్రం జీవితం

Monday, October 21, 2019

ఓంటరయిన ఈ జీవితాన్ని ఓడిపోవాలనుంది

తెలివి కూడిన లోకంలో తెలివితో ఉండాలని లేదు
విలువ కూడిన లోకంలో విలువతో ఉండాలని లేదు
తెలిసిన ఈ లోకంలో తెలియకుండా తేలిపోవలనుంది
మరువలేని నీ జ్ణాపకాలను మరిచిపోవాలనుంది
నీతోలేని ఈ లోకాన్ని వీడిచి పోవాలనినుంది
ఓంటరయిన ఈ జీవితాన్ని ఓడిపోవాలనుంది