Followers

Friday, November 25, 2011

పడి లేచే కెరటమే జీవితమని
మరల తరలి ఎగిసి పడాలాని
అలుపెరుగని ఈ జీవితాన్ని
తలపన్నదెరుగక ముగించకు.

కాలం కమనీయం, రాగం రమణీయం
లాస్యం, హాస్యం ఎరుగని జీవితం సూన్యం
అలుపెరుగని ఈ జీవితాన్ని
తలపన్నదెరుగక ముగించకు

పీల్చే ప్రతి శ్వాసలో జీవించూ
తలిచే ప్రతి భావన పలికించూ
చూసే ప్రతి చూపుతో పులకించు
అలుపెరుగని ఈ జీవితాన్ని
తలపెరుగని జీవితంగా ముగించకు.

Friday, November 4, 2011

నా తొలి ప్రేమ కావ్యం

ప్రేమిస్తేనే కవులవుతారంటే,
ఆ ప్రేమ దేశంలే నే ఆధి కవినవుతా
ప్రేమికుల ప్రతీ పలుకు ఒక కావ్యమంటే
నే రచియించిన తొలి ప్రేమ కావ్యం నీ పేరు

లలిత లావణ్యములు

నిషి నఘవులేమొ ఈ నఘిల సిగులు,
కలువ కోమలమేమొ ఈ కోమలాంగి కవల నయనములు
దీప్తి కన్నాస్వేతము తన దంతములు,
శ్వాశ కంటె తియ్యనిధి తన పరిమలము,
సప్త స్వరాలను మించిన సుస్వరము తన పలుకులు,
పడచు పరవాలకన్న పొగరెక్కినవి ఆ పరువాల,
వరణుని రాక తెలిపె మరుపేమో ఆ నడుము,
సిరిమువ్వలతో సరసమాడే ఆ నడకలు,
చంద్రుడు కూడ ఓర్వలెని మురిపము తన విరసము,
లవణ సంపన్నమగు ఈ లలిత లావణ్యములు నాకందించిన నీకు నా ప్రాణమే అంకితము ...