Followers

Tuesday, November 22, 2022

భాగవతం

 వివరించినది కృష్ణుడినట

విరచించినది వ్యాసుడట

వినిపించినది శుకుడట

వినితరించినది పరిక్షిత్తుడట

తెలుగించినది పోతనట

మోక్షమొందినది  ప్రతి తెలుగువాడట

Monday, November 21, 2022

భారతం

 కృష్ణ విరచిత కృష్ణత్రయ కథ

కృష్ణుడికై ఉప్పతిల్లిన కృష్ణ కథ

కృష్ణుడిచే బోధించపడ్డ కృష్ణ కథ

చతుర్కృష్ణేచ అకృష్ణం భారతం

Saturday, August 13, 2022

యోగము

 

నీతో నా స్పర్శ  ఓ యోగము నది

నీటిలోనా, రాతిలోన

చెట్టులోనా, పుట్టలోన

గాలిలోనా, ధూళిలోన

అంతా నీవా? నీలోనే అంతా?

నాలో నీవా? నీలోనే నేనా?

ప్రశ్నవి నీవా? జాబువి నీవా?

నిన్నెతుక తిలి అడుగు నేనా?

Wednesday, August 10, 2022

నిక్కము

 రాజు చెప్పేది రాజకీయము

కవులు చెప్పేది నాటకీయము

నెగ్గి చెప్పిందంతా నీతివాక్యము

నిలకడ లేనిది నిక్క వాక్యము

Saturday, August 6, 2022

మోక్షం

 ధూలి చేత, గాలి చేత

నీటి చేత, నిప్పు చేత

ఎన్నిసార్లు మరణించదనయ్యా

నాస్తి నా ఆస్తనినెరుంగక.

 

అందమని, బంధమని

యోగమని, భోగమని

ఎన్నిసార్లు జీవించదనయ్యా

నీ శబ్ధమందు నిశబ్ధమెరుంగక


Sunday, July 3, 2022

తల్లి భారతి

 నా తల్లి పేరు మార్చినా

తన ముక్కలకతుకులేసినా

తన ఆచారాన్ని అనచివేసినా

ఆచరించువారు అంతరించిపోతున్న

ఉర్వికెల్లా శాంతి చూపనా

సామరస్యమను సాము చేయనా


రాజ్యమని మతమని వర్తకమని

పూటకొక్క పేరుతో, పుటానికొక్క రీతితో

తన అస్తిత్వాన్నే అస్థిర పరిచినా

అసలు రూపాన్నే మార్చి వేసినా

ఉర్వికెల్లా శాంతి చూపనా

సామరస్యమను సాము చేయనా

Monday, June 13, 2022

ఈశ్వరం

 నయనానందమునొంద అరూపస్యరూపిణివే

సుగంధపరిమళమొంద విభూతిలేపినివే

శ్రవణానందమునొంద డమరుకధారివే

మదిపులకింతనొంద తాండవకేళివే

ఏమొంద నే నీ నుండి యోగధ్యానముతప్ప