Followers

Saturday, February 13, 2021

ఱేడు

ప్రకాశం సూరీనిది

ప్రతాపం సూరీనిది

దివిసీమ అతనిది

చుక్కలసేన అతనిది

చౌద్యమెరుగుదువ

ఱేడు మాత్రం చంద్రుడట

Wednesday, December 30, 2020

ఆత్మ

 జననం ఘటనం

జీవం మిధ్యం

మరణం సత్యం

ఆత్మం  చిరం

ఇదం తధ్యం

సన్నార్థం దైవం

Tuesday, December 29, 2020

స్త్రీ

సృష్టి కార్య మూలానివై
సృష్టి వీర్య దారివై
సృష్టికి మూలం నీవు

తపొః భంగ తంత్రానివై
యుద్ధ మూల మంత్రానివై
సృష్టికి అంతం నీవు

అందం నీవే, బంధం నీవే
సర్వం నీవే, శూన్యం నీవే
సంసారం నీవే, సన్యాసం నీవే

Sunday, October 11, 2020

బతుకు బండి

పోటెత్తిన ఓటమితో
కొండెక్కిన జీవితాన్ని
సాగనంపిన సాగిపోని
బతుకు బండిపైన
ఎన్నాల్లిల? ఎన్నేల్లిల?
గమ్యమెరుగని పయనం

Tuesday, October 6, 2020

భార్య

తడి ఆరని ముంగుర్లని 

వడిగా ముడిలో నెట్టి

తడిసి తడవని నడుమును

తుడిచి తుడవక వంచి

వాలిపొతున్నా వంకను

కొంగున బిడి బిగించి 

పారే ఝరినోలే

జారే చీరను సర్ది

అరుణ సింధూరంతో

అరుణోదయాన

వడి వడి అడుగులతో 

వేడిని కక్కే కాఫినిచ్చే

ఔదార్యమే కద భార్యంటే

Friday, September 4, 2020

అందుకోలేకున్నాను

తొలకరి పులసల్లే యధ ఎగిరిపడుతోంది

మలిదారి మలుపల్లే మన కధ మారుతోంది

అద్దంలో బొమ్మల్లే నువ్వు అందకున్నావు

కళ్ళలో చూపల్లే నిను తాకలేకున్నాను

చదవలేని కవిత

నిను తడిమే నా చూపులని

నీ చూపు ఆపేస్తోంది

బిగిలో నీ పరిమళాన్ని 

నా బిడియం ఆపుతోంది

నిను తాకే ఆరాటాన్ని 

మొహమాటమాపుతున్నది

నీపై ప్రేమను తెలుప

మన స్నేహమాపుతున్నది

నువు చదవలేని ఈ కవితను

కళ్ళతొ రాసాను శ్వాసతోటంపాను

నిను చేరలేని ఈ దూరాన్ని

వెతతో నింపాను వేదనయి నిలిచాను