పెదవి దాటలేని మాటలు
కళ్ళలోనే పలుకుతాయి
కంటనీరుగా కారిపోకముందే
గుండెలోని జ్ఞాపకాలుగా మారిపోని
పెదవి దాటలేని మాటలు
కళ్ళలోనే పలుకుతాయి
కంటనీరుగా కారిపోకముందే
గుండెలోని జ్ఞాపకాలుగా మారిపోని
గాలినైతే గంధమెరుగక కలుపుకెల్తిని
నీటినైతే కట్టనెరిగి మలుపుకెల్తిని
పశువునైతే లోకమెరుగక రమించిపోతిని
మనిషినైతిని తర్కమెరిగి తపించిపోతిని
పెట్టుబడి పెత్తందారులను చేసిందంట
శోషలిజం సోమరిపోతులను
చేసిందంట
కమ్యునిజం నియంతలును
చేసిందంట
ప్రజాస్వామ్యం
ఓట్ల పేకలు చేసిందంట
ఏది ఒప్పు ఏది
తప్పు నాకెందుకు చెప్పు
నా వాళ్ళు నా
ఇల్లు తప్ప నువ్వెందుకు వెళ్ళు
గఱికనరయు గిడ్డంగులెన్నున్నా
కమల్చ కించిత్
కిత్తుండగా చాలదా
వీరులెందరున్నా
రారాజునోటుపఱుచ
దుర్నీతొక్కటి
చాలునన్నది భారతం
వాలు జడ వంక
వాలు కంట చూడ
వల్లిల వళి
వలనై నను వాల్చెనది
పలు వలువల మత్పడచుకు
పులు హేతువు
కదా ఈ వాలు జడ
కృష్ణ విరచిత కృష్ణత్రయ కథ
కృష్ణుడికై ఉప్పతిల్లిన కృష్ణ కథ
కృష్ణుడిచే బోధించపడ్డ కృష్ణ కథ
చతుర్కృష్ణేచ అకృష్ణం భారతం
నీతో నా స్పర్శ ఓ యోగము నది
నీటిలోనా, రాతిలోన
చెట్టులోనా, పుట్టలోన
గాలిలోనా, ధూళిలోన
అంతా నీవా?
నీలోనే అంతా?
నాలో నీవా?
నీలోనే నేనా?
ప్రశ్నవి నీవా?
జాబువి నీవా?
నిన్నెతుక తిలి
అడుగు నేనా?
రాజు చెప్పేది రాజకీయము
కవులు చెప్పేది నాటకీయము
నెగ్గి చెప్పిందంతా నీతివాక్యము
నిలకడ లేనిది నిక్క వాక్యము
ధూలి చేత, గాలి చేత
నీటి చేత, నిప్పు చేత
ఎన్నిసార్లు మరణించదనయ్యా
నాస్తి నా
ఆస్తనినెరుంగక.
అందమని, బంధమని
యోగమని, భోగమని
ఎన్నిసార్లు జీవించదనయ్యా
నీ శబ్ధమందు
నిశబ్ధమెరుంగక
నా తల్లి పేరు మార్చినా
తన ముక్కలకతుకులేసినా
తన ఆచారాన్ని అనచివేసినా
ఆచరించువారు అంతరించిపోతున్న
ఉర్వికెల్లా శాంతి చూపనా
సామరస్యమను సాము చేయనా
రాజ్యమని మతమని వర్తకమని
పూటకొక్క పేరుతో, పుటానికొక్క రీతితో
తన అస్తిత్వాన్నే అస్థిర పరిచినా
అసలు రూపాన్నే మార్చి వేసినా
ఉర్వికెల్లా శాంతి చూపనా
సామరస్యమను సాము చేయనా
నయనానందమునొంద అరూపస్యరూపిణివే
సుగంధపరిమళమొంద విభూతిలేపినివే
శ్రవణానందమునొంద డమరుకధారివే
మదిపులకింతనొంద తాండవకేళివే
ఏమొంద నే నీ నుండి యోగధ్యానముతప్ప
తనని విశంతో నింపిన
దేవునికేమో పూల దండం
తన కర్త్వ్యం నిరవేర్చు
పాముకేమో బడిత దండం
పైగ శ్రిష్టించిన తానే
చంపి దేవుడయ్యేనంట
పనిని మించి పని ఉంచకేపూట
పాలు పితుకు సమయమన్నా
నిలిచి ఉండకేచోట
కరిగిపోకు అందమని బంధమని
కలిసిపోకు కులమని మతమని
ఓదిగిపోకు హక్కులని భాద్యతని
ఒక్కోటి ఒక కోటి బంధాలై
నిలువరింపునిన్ను ఈ లోకాన
ప్రకాశం సూరీనిది
ప్రతాపం సూరీనిది
దివిసీమ అతనిది
చుక్కలసేన అతనిది
చౌద్యమెరుగుదువ
ఱేడు మాత్రం చంద్రుడట